చరిత్ర ఒక బరువు, ఒక బాధ్యత. ఆ బరువుబాధ్యతలను హుందాగా అలవోకగా మోస్తూ వచ్చిన నగరం కాశీ లేదా వారణాసి. ప్రపంచానికి వెలుగు చూపిన ఈ దేశసంస్ కృతికి విలువైన ప్రతీక. శతాబ్దా లుగా ఎదుర్కొన్న కష్టా లను, దాడులను భరిస్తూ , ఎదిరిస్తూ తలెత్తు కు నిలిచిన నగరం కాశీ.
“వెయిటింగ్ ఫర్ శివ: అనెర్తిం గ్ ది ట్రూ త్ ఆఫ్ కాశీస్ గ్యానవాపి” కు తెలుగు అనువాదం ఇది. శకలాలుగా వున్న చరిత్రను ఒక సూత్రం గా కూర్చిన రచన, విశ్వేశ్వరుడిగా విశ్వనాథుడిగా అనాదిగా ఈ జాతిని తరింపచేస్తు న్న పరమేశ్వరుడి నివాసమైన కాశీ కథ ఇది. ‘కాశీలో తుది శ్వాస విడిస్తే చాలు ముక్తినిస్తా ’ అని శివుడు స్వయంగా ప్రకటించాడు. శతాబ్దా లుగా కాశీ పొందిన గౌరవమర్యాదలు, ముష ్కరుల దాడుల్లో శిథిలమైన కాశీ వ్యథలు, పడిన ప్రతిసారీ కాశీని మళ్లీ లేపిన అచంచలమైన భక్తిప్రపత్తు లు అన్నీ పేజీలలో మనను పలకరిస్తా యి. దెబ్బలు తినడం కాశీకి అలవాటే, అయితే చావుదెబ్బ కొట్టిం ది మటుకు 1669 లో ఔరంగజేబ్. ఆలయం ధ్వంసం చేసి, పడమటి గోడ మీద రెండు గుంబజ్ లు కట్టి, దాన్ని మసీదు అన్నాడు. గ్యానవాపి మసీదు ఉన్న స్థలం, ఆవరణ, 18 వ శతాబ్దం లో కట్టిన మందిరానికి మసీదుకు మధ్యలోని స్థలం మొత్తం వివాదాలకు కారణమయ్యాయి. గంగ నెత్తు రు పులుముకుని రోదించింది. బ్రిటి ష్ హయాం లో ఎన్ని వ్యాజ్యాలలో తీర్పులు ప్రకటించినా పరిష్కారం లేకపోయింది. 1947 తరవాత కాశీ మందిరానికి స్వేచ్ఛ తేవాలన్న సంకల్పం మరింత బలమైంది. 2021 లోనమోదైన సివిల్ కేసు దేశాన్ని ఒక ఊపు ఊపగా, సుప్రీం కోర్టు ASIని సమగ్ర నివేదిక సమర్పించమని కోరింది. 2024 జనవరిలో బయటకు వచ్చిన ASI నివేదిక ఏం చెబుతోంది?
గ్యానవాపి రహస్యాలను ఎంతో వివరంగా, ఆసక్తికరంగా, వివరించారు విక్రమ్ సంపత్. పాఠకుల మనసు గెలుచుకునే, ఆలోచింపచేసే రచన. ఇదిగో, తెలుగులో మీకోసం.


![Bhavishya Malika [English]: Decoded Prophecies Of Kali Yuga And Kalki Avatar](https://www.ziffybees.com/wp-content/uploads/2025/04/Front1-30-200x300.jpg)


