- -12%మానవునికి ఉన్న అన్ని బలాల్లోకి సంకల్పశక్తి విశిష్టమైనది. దాన్ని అలవరచుకోవటం ఎలాగో ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. ఆఫ్రికా అడవుల్లో సాహస యాత్ర చేపట్టిన హెన్రీ మోర్టాన్ స్టాన్లీ, మానవుల ఊహకే అందని అత్యంత సాహసోపేతమైన ప్రదర్శనలిచ్చిన డేవిడ్ బ్లైయిన్, బొమ్మ మాదిరిగా గంటల తరబడి నిలబడి వినోదాన్ని పంచిన అమందా పార్కర్, మద్యం వ్యసనంతో పోరాడిన ఎరిక్ క్లాప్టన్, మేరీ కర్ లు స్వీయనియంత్రణతో ఎటువంటి ఫలితాలను సాధించారో ఇందులో తెలుసుకోవచ్చు. డైటింగ్ ద్వారా సత్ఫలితాలు సాధించటం, కచ్చితంగా దినచర్యను పాటించి ఎప్పటి పనులు అప్పుడు వాయిదా లేకుండా పూర్తి చేయటం పొగతాగటం, మద్యం వ్యసనాల నుంచి బయటపడటం గురించి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎక్కువ స్వీయనియంత్రణ ఉన్న చిన్నారులు మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతున్నారు. తక్కువ ఊబకాయం. తక్కువ సుఖవ్యాధులు, ఆరోగ్యవంతమైన దంతసిరి (స్వీయనియంత్రణలో పళ్లు తోముకోవటం, పుక్కిలించి ఉమ్మటం వంటివి కీలకం) కలిగి ఉన్నారు. యుక్తవయసులో స్వీయనియంత్రణ కొరవడిన వ్యక్తులు ఆల్కహాలు, డ్రగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా బలహీనమైన స్థితిలో మనుగడ సాగిస్తున్నారు. అలాగే తక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల్లో సర్దుకుపోతున్నారు. దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించటంలో విఫలం కావటం వల్ల ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ గా పిల్లలను పెంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన పరిశోధన ఫలితాలు ఈ పుస్తకం మొత్తం కనిపిస్తాయి.
₹399.00Original price was: ₹399.00.₹351.12Current price is: ₹351.12.in Self-HelpSku: 9789355437686Willpower- Rediscovering the Greatest Human Strength(Telugu)